telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్య కొత్త సినిమా టైటిల్ విడుదల ఎప్పుడంటే..?

తెలుగు అగ్రహీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్‌లో ఉంటారు. బాలయ్య సినిమాలంటే ప్రేక్షకులు ఏ స్థాయి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే తనకు రెండు బ్లాక్ బస్టర్లు అందించిన బోయపాటితో మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా బీబీ3గా ప్రచారం అవుతుంది. ఈ సినిమాపై అభిమానులు తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడు ఓ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే… ఈ సినిమా టైటిల్. అయితే ఇక అభిమానుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే… ఉగాది రోజున మధ్యాహ్నం 12:33 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సినిమా మే28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Related posts