ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం అమరావతి నుంచి కర్ణాటకకు బాబు పయనమయ్యారు. కాగా, కర్ణాటకకు బయలుదేరి వెళ్లడానికి ముందు విలేకరులతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఈరోజు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మాండ్యా జిల్లాలోని పాందవ స్టేడియంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడ తదితర ప్రముఖులు పాల్గొంటారు.