telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు…?

devineni uma disappointed on utsav arrangements

మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పై,  ఒక సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసు పెడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారని..16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి,  చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. కొనుగోలు చేసిన వారు కానీ , అమ్మిన వారు గానీ ఫిర్యాదు చేయలేదని ఎస్సీ,ఎస్టీ కాని ఆళ్ల రామకృష్ణ రెడ్డితో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు అమరావతిలో ఉన్నప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అధికార మదంతో, దేశమంతా చూడాలి అనే హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చారన్నారు  రాజకీయ కక్షతో, ఈర్ష్యా ద్వేషాలతో కేసులు పెడుతున్నారు అని ఎన్ని కేసులు పెట్టినా మా వెంట్రుక కూడా పీక లేవన్నారు ఉమా. చూడాలి మరి దీని పై వైసీపీ నేతలు ఏ విధంగా సమాధానం ఇస్తారు అనేది.

Related posts