పాక్ భారీకాయుడు నూర్ హసన్ సైదికాబాద్ జిల్లా వాసి. సుమారు 330 కిలోల బరువుండే హసన్ కు స్థూలకాయం వల్ల ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం సమస్యగా మారింది. దీంతో అతను పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాను సోషల్ మీడియా ద్వారా తనకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. హసన్ అభ్యర్థన మేరకు అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు బజ్వా ఏర్పాటు చేశారు. దీనికోసం సైన్యాన్ని హసన్ ఇంటికి పంపించారు. దాంతో ఇంటి గోడ బద్దలు కొట్టి అతడ్ని బయటకు తీసుకొచ్చిన ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్‌లోని షాలిమార్ ఆసుపత్రికి తరలించింది. హసన్‌ను అక్కడి మీడియా పాక్‌లోనే అత్యంత బరువు కలిగిన వ్యక్తిగా పేర్కొంటున్నప్పటికీ అధికారిక నివేదికలు మాత్రం లేవు. ఇక గతేడాది పాక్ ఎండోక్రైన్ సొసైటీ విడుదల చేసిన సర్వే నివేదికల ప్రకారం పాకిస్థాన్‌లో 29 శాతం మంది అధిక బరువుతో ఉంటే, వీరిలో 51 శాతం మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.