telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న అరెస్టులో హక్కుల ఉల్లంఘన: దేవినేని

devineni on power supply

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు.

శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ వాహనంలో తరలిస్తారా అని ప్రశించారు. రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తారా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది జగన్‌ గారు’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

వ్యవసాయ బడ్జెట్‌లో ఖర్చు చేసింది మూడోవంతు మాత్రమే. మాఫీ బకాయిలు 7 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. రైతులను కులాల పేరుతో విభజించి 13 లక్షల మంది కౌలు రైతులను ముంచారు. ధరల స్థిరీకరణ నిధులెక్కడ ఖర్చుపెట్టారు? ఎంతమంది రైతులకు సున్నావడ్డీ, బీమా పరిహారం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయగలరా వైఎస్ జగన్ గారు?’ అని ఆయన మరో ట్వీట్ లో ప్రశించారు.

Related posts