telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు : మంత్రి సబిత

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2017 డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఉర్దూ మీడియం పోస్టులు 900 ఉన్నాయని తెలిపారు. అయితే 336 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలు 1109 ఉన్నాయని తెలిపారు. 5,964 పోస్టుల భర్తీ చేపట్టగా, 4,418 మందిని నియామకం అయ్యారు. ఉర్దూ మీడియం పాఠశాల్లోనే సమస్యలు లేవని తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కారిస్తామని మంత్రి సబితా స్పష్టం చేశారు.

 

Related posts