telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

తిరుపతి ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు…

ఏపీలో ఎన్నికల వేడి కొనసాహుతునే ఉంది. మొదట పంచాయతీ, మున్సిపల్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా తాజాగా తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 23 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లకి తుది గడువు ఇవ్వనున్నారు. అలాగే ఏప్రిల్ 3 ఆ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇక ఎన్నికలు జరిగిన తర్వాత మే 2న కౌంటింగ్ ఉండనుంది. అయితే ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా అన్ని పార్టీలు ముందస్తుగానే సిద్ధం అయ్యాయి. అందరి కంటే ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. అటు వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థి అంటూ లీకులు ఇచ్చింది. జనసేన -బీజేపీ తరపున బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎం జరుగుతుంది అనేది.

Related posts