ఈరోజు చంద్రబాబుకి సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజధాని అమరావతి భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు అధికారులు… హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వచ్చిన ఆరుగురు అధికారులు.. భద్రతా సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లి.. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.. విచారణకు హాజరు కావాల్సిందిగా కోరామని చెబుతున్నారు సీఐడీ అధికారులు. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఏపీ మంత్రి శంకర్‌నారాయణ… చంద్రబాబు పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ జైలుకు పోయే కాలం వచ్చిందని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇక, ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పారని కామెంట్ చేసిన మంత్రి శంకర్‌నారాయణ.. సీఐడీ మొదట నారా లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. చూడాలి మరి దీని పై లోకేష్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది.
previous post
next post
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీకి 503 సీట్లు..