telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఎస్సెస్సీ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 29

150 candidates lost chance on panchayati exam

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2020లో నిర్వహించే పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 29 వరకు గడువు విధించినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుం తో నవంబర్ 13 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 27 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11 వరకు గడువు విధించామని చెప్పారు. ఆ తర్వాత ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపారు.

నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పంపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టులకు రూ. 125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125, ఒకేషనల్ విద్యార్థులు సాధారణ పరీక్ష ఫీజుకంటే రూ.60 అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు.

Related posts