దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన పులి సత్యనారాయణ మంగళవారం ఓ పండ్ల దుకాణం వద్ద కార్యకర్తలతో కలిసి దుబ్బాక కౌంటింగ్ ను టీవీలో వీక్షిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడంతో సత్యనారాయణ రెడ్డి గుండెపోటు తో అక్కడిక్కడే కుప్పకూలాడు. కార్యకర్తలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. కాగా దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీ తో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 61302 ఓట్లు, కాంగ్రెస్ 21819 ఓట్లు, బీజేపీ 62, 772 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాంక్స్‌ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావునే వరించింది.
previous post
next post
గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్