telugu navyamedia
రాజకీయ వార్తలు

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా కోసం .. సంతకాల సేకరణ..

signs collection to free brazil ex president lula

క్యూబా ప్రభుత్వం బ్రెజిల్‌ దేశవ్యాప్తంగా మాజీ అధ్యక్షుడు లూలా డిసెల్వాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వున్న ప్రభుత్వ సంస్థలు, స్టడీ సెంటర్ల ద్వారా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఈ నెల 27వ తేదీ లూలా 74 జన్మదినోత్సవం అన్న విషయం తెలిసిందే. లూలా డిసెల్వాను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ ఒక ట్వీట్‌లో వివరించారు.

ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత క్యూబన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ విత్‌ పీపుల్స్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 1 నుండి 3 వ తేదీ వరకూ హవానాలో జరిగే సామ్రాజ్యవాద వ్యతిరేక సదస్సుకు హాజరయ్యే బ్రెజిలియన్‌ ప్రతినిధి వర్గానికి అందచేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బ్రెజిల్‌ జైలులో నిర్బంధంలో వున్న లూలా తన జైలు శిక్షపై సుప్రీంకోర్టు సమీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం ఆయన్ను కోర్టు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Related posts