టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సిందిగా కోరింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు.
సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై 2 రోజులపాటు సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 1000 మంది విద్యావేత్తలు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ‘ఇండియా ఎట్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్’ అనే థీమ్ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను నిర్వాహకులు కోరారు.