telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

యూనివర్శిటీ హాస్టళ్లు.. క్వారంటైన్ కేంద్రాలు!

punjob hostel

దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టారు. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పంజాబ్ యూనివర్శిటీ హాస్టళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తూ కేంద్ర పాలితప్రాంతాల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా రోగులను క్వారంటైన్ చేసేందుకు వీలుగా పంజాబ్ యూనివర్శిటీలోని 4 వసతిగృహాలను కేటాయిస్తూ కేంద్రపాలితప్రాంతం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే రెండు హాస్టళ్లను ఖాళీ చేయించి వైద్యాధికారులకు అప్పగించిన‌ట్లు యూనివ‌ర్సిటీలు అధికారులు తెలిపారు. కాగా చండీఘడ్ నగరంలో 56 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Related posts