తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను నియమించి బస్సులను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు డ్రైవర్లకు అనుభవంలేదంటూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ ఈమేరకు పిల్ వేశారు.
తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 90 రోజులపాటు శిక్షణ ఇచ్చేవిధంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాల్లో వివరణ సమర్పించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి అదేశాలను జారీచేసింది.