telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రకాశం జిల్లాలో వైసీపీ దౌర్జన్యం.. ఓటు వేయలేదని రోడ్డు ధ్వంసం!

ycp party

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఏదో విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు రోడ్డును తవ్వి ధ్వంసం చేశారు. ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి దిగారు.

స్థానికంగా ఉప్పలపాడులోని ముస్లిం కాలనీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. సరిగ్గా 10 నెలల క్రితమే ఈ నిర్మాణం పూర్తయింది. ఇటీవల ఎన్నికల్లో ఆ కాలనీ వాసులు కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనర్సింహరెడ్డికి మద్దతు పలికారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు ఆ రోడ్డును తవ్వి ధ్వంసం చేశారు. అడ్డుకోడానికి వచ్చినవారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. చేతనైంది చేసుకోండంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts