telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ క్రికెటర్లను చూసి నేర్చకోండి…

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్ క్రికెటర్లు మాత్రం అన్నీ నేర్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. మహ్మద్ అమీర్.. తాజాగా మాట్లాడుతూ… ‘భారత్‌లోని యువ క్రికెటర్లను ఒక సారి చూడండి.. అలానే ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లను కూడా గమనించండి. వాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. జూనియర్ స్థాయి, దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా వాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అవసరమైన స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు. ఒక్కసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అవకాశం దక్కగానే.. తమ స్కిల్స్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అందుకే పూర్తిగా సన్నదం కాకుండానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావద్దని, దేశవాళీ క్రికెట్‌లో కావాల్సిన స్కిల్స్‌ను పెంపొందించిన తర్వాతే అరంగేట్రం చేయాలని ఆమీర్ సూచించాడు.

Related posts