telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఉన్నట్లు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు…

niranjan

వనపర్తిలోని తన నివాసంలో 421 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసి వారితో కలిసి విందు భోజనం చేసారు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అందరూ బాగుండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష  అని…కరోనాతో ప్రపంచం స్థంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్నారు.  కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు సంక్షేమ పథకాలు లేవని.. సామాన్య ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉంటేనే ఇలాంటి పథకాల అమలు సాధ్యమవుతుందని తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు ప్రజల కష్టాలను దగ్గరుండి చూశామని… కాబట్టే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలం, బలగమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన కొనియాడారు. కాగా… తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. రెండు స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్.

Related posts