telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ బాబర్ ను అది నేర్చుకోవాలి…

పాకిస్థాన్ మాజీ పేసర్ అకిబ్ జావెద్ మాట్లాడుతూ… స్వింగ్ బాల్స్‌కు తడబడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆ సమస్యను అధగమించేందుకు బాబర్ ఆజామ్‌ సాయం తీసుకోవాలని అన్నాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లో బాబర్ ఆజామ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌లానే ఎలాంటి సమస్యలు, బలహీతలు లేవన్నాడు. కాకపోతే ఫిట్‌నెస్ విషయంలో బాబర్ ఆజామ్.. విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలని, అలా చేస్తే అతను మరింత గొప్ప ప్లేయర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ‘బాబర్ ఆజామ్ కన్నా విరాట్ కోహ్లీ బెటర్ రేంజ్ షాట్స్ ఆడగలడు. కానీ అతనికి ఓ బలహీనత ఉంది. స్వింగ్ బాల్స్‌కు అతను తడబడుతాడు. సులువుగా ఆఫ్ స్టంప్ వికెట్‌ను పారేసుకుంటాడు. ఇంగ్లండ్ పర్యటనలో జేమ్స్ అండర్సన్ ఈ బంతులతోనే కోహ్లీని ఇబ్బంది పెట్లాడు. అయితే బాబర్ ఆజామ్‌కు మాత్రం సచిన్ టెండూల్కర్‌లా ఇలాంటి బలహీనతలేం లేవు. టెక్నికల్‌గా బాబర్ చాలా సేఫ్. కానీ అతను ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలి. అప్పుడు అతను మరింత గొప్ప ఆటగాడవుతాడు. అలాగే బాబర్‌ను చూసి విరాట్ తన టెక్నిక్ విక్‌నెస్‌ను అధిగమించాలి. ‘అని అకిబ్ సూచించాడు.

Related posts