telugu navyamedia
క్రీడలు వార్తలు

అహ్మదాబాద్ పిచ్ పై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు…

Yuvraj

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన పింక్-బాల్ టెస్ట్ కేవలం 2 రోజుల్లో ముగియడంతో అహ్మదాబాద్ పిచ్ టెస్ట్ క్రికెట్‌కు అనువైనది కాదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 112 పరుగులకు ఇంగ్లండ్‌ను కట్టడి చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన తరువాత, భారత్ మళ్లీ ఇంగ్లండ్‌ను 81 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. ఆ తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్ 49 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. దాంతో భారత్‌కు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ కేవలం 5 సెషన్లకు మాత్రమే కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ పై యువరాజ్ సింగ్ స్పందిస్తూ… మొదట ఇషాంత్ శర్మ తన 100 వ టెస్ట్ మరియు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో 400 వికెట్లు తీసినందుకు అభినందించాడు. కానీ ఈ పిచ్ పై అనిల్ కుంబ్లే మరియు హర్భజన్ సింగ్ వంటి బౌలర్లు బౌలింగ్ చేస్తే 1,000, 800 వికెట్లు తీసేవారు అని తెలిపాడు. అయితే కేవం యువీ మాత్రమే కాకుండా చాలా మాది మాజీలు అలాగే అభిమానులు ఈ పిచ్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే రెండు జట్లు ఈ పిచ్ పైనే ఆడాయి కదా… అని కొందరు అంటున్నారు.

Related posts