telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4″లో గంగవ్వ ఎంట్రీ ?

Gangavva

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఇప్పటికే సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాగా… 106 రోజుల పాటు బిగ్ బాస్ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలయినట్టే. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. నాగార్జున ఇటీవల మూడు పాత్రల్లో కనిపించిన బిగ్ బాస్ 4 ప్రోమో తరువాత కచ్చితంగా షో మొదలవుతున్న సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అంతే కాదు ఈ నెలాఖరులో (అందుతున్న సమాచారం ప్రకారం..ఈ నెల 29, 30 తేదీల్లో) బిగ్ బాస్ 4 మొదలయ్యే అవకాశం ఉంది. ఈసారి బిగ్ బాస్ లో 16 మంది ఉండబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో పాల్గొనబోయే కంటిస్టెంట్స్ ఎవరనేది ఏ మాత్రం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయాన్ని మాత్రమే అఫీషియల్ చేసిన మేనేజ్మెంట్ ఈ షో ఎన్ని రోజులు జరగనుంది? ఎంతమంది కంటిస్టెంట్స్ ఉంటారు? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు బిగ్ బాస్ ఈ నేపథ్యంలో తాజాగా ‘మై విలేజ్ షో’ సెన్సేషన్ గంగవ్వను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరిగిపోయాయని, మిగతా కంటిస్టెంట్లతో పాటు గంగవ్వను కూడా క్వారంటైన్ పంపించబోతున్నారనేది తాజా సమాచారం. ఇదే నిజమైతే గంగవ్వ సందడితో ఈ సారి బిగ్ బాస్ సరికొత్త శోభ సంతరించుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.

Related posts