telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రంగమార్తాండ”లో అనసూయ ?

Anasuya

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో మూడు నెలలపాటు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనసూయ.. మళ్లీ ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ప్రతిరోజూ పండగే’ షోలతో బిజీగా ఉన్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ఆ సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.తాజాగా ఈ అందాల యాంకర్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం “రంగమార్తాండ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సినిమా నటసామ్రాట్ కు ఇది రీమేక్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని టాక్. అనసూయ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట.

Related posts