telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్ వేధించాడంటూ హీరోయిన్ డ్రామా… అసలు నిజం బయటపెట్టి ఆమెకు షాకిచ్చిన మేనేజర్

Shadow

ప్రముఖ పాకిస్థానీ గాయకుడు అలీ జాఫర్‌కు ఇండియాలోనూ పాపులారిటీ ఉంది. గతేడాది మీషా షఫి అనే పాకిస్థానీ నటి.. అలీ తనను లైంగికంగా వేధించాడని షాకింగ్ ఆరోపణలు చేసింది. దాంతో అందరూ అలీని అవమానించారు. తాను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదని అలీ చాలా సార్లు బోరుమన్నాడు. కానీ సమాజం అమ్మాయి మాటే వింటుంది కాబట్టి అందరూ మీషాకే మద్దతు తెలిపారు. దాంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. వాదోపవాదాలు పూర్తయ్యాక అలీని నిర్దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన పరువు తీసినందుకు అలీ, మీషాకు తగిన గుణపఠం చెప్పాలనుకున్నాడు. తన పేరు ప్రతిష్టలను చెడగొట్టిందని మీషాపై అలీ పరువు నష్టం దావా వేశాడు. మీషా అసలు స్వరూపాన్ని ఆమె వద్ద మేనేజర్‌గా పనిచేసిన సయ్యద్ ఫర్హాన్ మీడియా ముందు బయటపెట్టాడు.”అలీ జఫర్ ఎప్పుడూ మీషాతో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. లైంగికంగా వేధించలేదు. పెప్సీ సంస్థ నిర్వహిస్తున్న బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ అనే షోకు ఆతిఫ్ అస్లాం, మీషా జడ్జెస్‌గా వ్యవహరిస్తుండేవారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆతిఫ్ స్థానంలోకి అలీ జఫర్ వచ్చాడు. అది మీషాకు నచ్చలేదు. అలీ ఉంటే నేను షో చేయను అని చెప్పింది. దాంతో పెప్సీ కంపెనీ నుంచి ఎక్కువ డబ్బు తీసుకోవడానికి అలీని, కంపెనీని మీషా బెదిరించింది. కానీ అలీ భయపడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ మీషా అలీపై లైంగిక ఆరోపణలు చేసింది. అతని పేరును చెడగొట్టాలని చూసింది. ఒక్కటి మాత్రం చెప్పగలను.. బ్లాక్ మెయిల్ చేయడం, ఒకరి పేరును చెడగొట్టడం మీషాకు వెన్నతో పెట్టిన విద్య” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Related posts