telugu navyamedia
సామాజిక

ఇప్పటికీ విక్టోరియా దగ్గర గుర్రపు బగ్గీలు ..

ఒకప్పుడు హైద్రాబాద్‌లో గుర్రపు బగ్గీలు ఉండేవి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి . ఎప్పుడైనా పెళ్లిలో మాత్రం ఇప్పటికీ గుర్రపు బగ్గీలపై వధూవరులను ఊరేగిస్తుంటారు. అయితే కలకత్తాలో మాత్రం ఇప్పటికీ ట్రామ్ లు , మనుషులు నడిపే రిక్షాలు , గుర్రపు బగ్గీలు వున్నాయి.

బ్రిటిష్ వారి కాలంలో మొదట కలకత్తా దేశ రాజధానిగా ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ వారు అనేక అపురూపమైన భవనాలను నిర్మించారు.ఇప్పటికీ ఆ భవనాలు చెక్కుచెదరకుండా వున్నాయి. అయితే కలకత్తా మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే వెనుకపడే ఉందని చెప్పాలి. ఇప్పటికీ కలకత్తాలో హెరిటేజ్ భవనాల సంరక్షణ తో పాటు సంప్రదాయ ప్రజా రవాణాను కొనసాగిస్తూ ఉండటం విశేషం.

14 Best Historical Places in Kolkata (2021) Monuments in Kolkata (Photos)

ట్రామ్ లను ప్రజా రవాణా నుంచి తొలగించినా చౌరంగీ లేన్ లో మాత్రం ఇప్పటికీ తిరుగుతూ ప్రజలకు గత కాలాన్ని గుర్తు చేస్తుంటాయి. మనుషులు నడిపే రిక్షాలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తుంటాయి .గుర్రపు బగ్గీలు మాత్రం జవహర్ లాల్ నెహ్రు మార్గంలోని విక్టోరియా మెమోరియల్ దగ్గర ఎక్కువుగా కనిపిస్తుంటాయి . కలకత్తా వచ్చినవారు తప్పకుండా విక్టోరియా మెమోరియల్ చూడకుండా వెళ్ళరు.

బ్రిటిష్ రాణి విక్టోరియా 1901వ సంవత్సరంలో చనిపోయారు . ఆమె స్మృతి చిహ్నంగా అప్పటి బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ రాణి కోసం ఓ మ్యూజియం నిర్మించాలని సంకల్పించారు. ఒక భవనం , దాని చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేయాలనుకున్నారు.1906 జనవరి 4వ తేదీన అప్పటి బ్రిటిష్ రాకుమారుడు వాలేష్ శంకుస్థాపన చేశారు 1921లో ఈ మ్యూజియం ప్రారంభమైంది. 100 సంవత్సరాలక్రితం మొదలైన ఈ మ్యూజియం లో 30,000 వేల అపురూపమైన కళాఖండాలున్నాయి .

Did you know a British India law to rein in horse drawn carriage drivers  was applicable

ప్రతి రోజు వేలాది మంది ఈ మ్యూజియం చూడటానికి వస్తుంటారు. వారి కోసం మ్యూజియం వెలుపల ఒకప్పటి గుర్రపు బగ్గీలు ఆకర్షణగా కనిపిస్తాయి . పిల్లలే కాదు పెద్దవారు కూడా వీటి మీద ప్రయాణించాలని కోరుకుంటారు . మీరు ఎప్పుడైనా కలకత్తా వెడితే విక్టోరియా మ్యూజియం చుసిన తరువాత గుర్రపు బగ్గీ ఎక్కడం మర్చిపోకండి .
-భగీరథ
కోల్ కతా నుంచి ..

Related posts