telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కోసం ర్యాప్ సింగర్ బాబా సెహగల్ స్పెషల్ సాంగ్

Pawan

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, సమంత తదితర ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జాతీయస్థాయి ర్యాప్ సింగర్ బాబా సెహగల్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తెలిసిందే. ఈ ర్యాపర్ తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను పవన్ కు, ఫ్యాన్స్ కు అంకితం ఇచ్చారు. పవన్ కల్యాణ్ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం ఎంతో హుషారుగా సాగిపోతుంది. మొత్తమ్మీద బాబా సెహగల్ గాత్రంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉందీ పాట. కాగా ‘జల్సా’ చిత్రంలో టైటిల్ సాంగ్ పాడినప్పటి నుంచి బాబా సెహగల్ కు పవన్ అంటే అభిమానం. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’లోనూ మరోసారి టైటిల్ సాంగ్ ఆలపించారు.

Related posts