సౌదీ అరేబియా ప్రభుత్వం గత వారం ఏర్పాటుచేసిన ఓవైసీ సమ్మిట్‌కు అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో… సమ్మిట్‌లో పాల్గొన్న ఇమ్రాన్‌ఖాన్ సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ఆయనను పలకరించి ఏదో మాట్లాడారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్‌ఖాన్ చెప్పింది సౌదీ రాజుకు వివరిస్తుండగానే ఇమ్రాన్‌ఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కనీసం తాను ఏం చెప్పింది సౌదీ రాజు వినే వరకు కూడా ఉండకుండా ప్రొటోకాల్‌ను సైతం మరిచి ఇమ్రాన్‌ఖాన్ ప్రవర్తించాడని పాకిస్థాన్ ముస్లిం లీగ్ సభ్యులు మండిపడుతున్నారు. ఇమ్రాన్‌ఖాన్ చేసిన పనికి అనేక మీటింగ్‌లు రద్దు అయ్యాయని, సౌదీ, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన సమావేశం కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రవర్తనపై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.