telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నిశ్శబ్దం” నుంచి అంజలి లుక్ విడుదల

silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా అంజ‌లి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. మ‌హా అనే పాత్ర‌లో క్రైమ్ డిటెక్టివ్‌గా అంజ‌లి అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. అంజ‌లి లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అతి త్వ‌ర‌లో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related posts