telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమాజంలో నిజమైన హీరోలు వాళ్ళే… : పరేశ్ రావల్

Paresh Rawal

సమాజంలో నిజమైన హీరోలు ఆర్మీ, పోలీసులేనని.. ప్రముఖ నటుడు పరేశ్ రావల్ తెలిపారు. తదుపరి తరానికి నిజమైన హీరోల అర్థాన్ని తెలిపేందుకు తమ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ఎంటర్‌టైనర్స్‌గా పిలవాలని భావిస్తున్నామని పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘నిజమైన హీరోల వాస్తవ అర్ధాన్ని తెలుసుకోవడానికి తదుపరి తరానికి నటులను ఎంటర్‌టైనర్స్‌గా పరిచయం చేయాలనుకుంటున్నాం. అలాగే మన ఆర్మీ, పోలీసులను హీరోలుగా పిలవడం ప్రారంభించాలి’’ అని పరేశ్ రావల్ కోరారు. హీరోలంటే సినిమాలలో మూడు ఫైట్లు చేసి, ఆరు డైలాగ్స్ చెప్పి, హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసేవారేనని భావిస్తున్నారు ఇప్పటి తరం. అందుకే వారికోసం కొట్టుకుని చస్తున్నారు. నిజానికి హీరోలుగా చెప్పుకోవాల్సిన ఆర్మీ, పోలీసుల గురించి పట్టించుకోవడం మానేశారు యువత. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి పోలీసులు, భారతదేశంపై ఇతర దేశాల కన్ను పడకుండా పగలూ, రాత్రి కాపాలా కాస్తున్న సైనికులు నిజమైన హీరోలని పరేశ్ రావలే కాదు ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు హీరోలని భావిస్తున్న వారిని కూడా పబ్లిక్‌లోకి వస్తే కాపాడాల్సింది ఆ పోలీసులే కాబట్టి.

Related posts