లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై తమ రోజు వారీ యాక్టివిటీలను ఫోటోలు, వీడియోల రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ నటి మాత్రం తను ఎదుర్కొంటున్న బెదిరింపుల తాలూకు స్క్రీన్‌షాట్ షేర్ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హిందీ బిగ్‌బాస్ 13 సీజన్‌లో పాల్గొన్న దేవలీనా భట్టాచార్జీ, రష్మీ దేశాయ్ మంచి మిత్రులు. ఆ సమయంలో నటుడు అర్హాన్ ఖాన్ తనకు పెళ్లి అయిందనే విషయాన్ని దాచిపెట్టి బిగ్‌బాస్ ఇంట్లో రష్మీదేశాయ్‌తో రిలేషన్ కొనసాగించాడు. అయితే ఇదివరకే అతనికి పెళ్లయిందని, పిల్లాడు కూడా ఉన్నాడంటూ హోస్ట్ సల్మాన్ ఖాన్ గుట్టు బయటపెట్టడంతో.. వారి ప్రేమ బీటలు వారింది. ఈ బంధానికి ఇక్కడితో ముగింపు పలికితేనే మంచిదని రష్మీ దేశాయ్‌కు దేవలీనా గతంలోనే సలహా ఇచ్చింది.
అంతేకాక తన స్నేహితురాలిని మోసం చేసాడన్న కడుపుమంటతో అర్హాన్ ఖాన్‌పై పలు మార్లు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీర్ణించుకోలేని అతని అభిమాని ఇక్కడితో ఆపెయ్ అర్హాన్‌ఖాన్‌ను ఇంకొక్క మాట అన్నా ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగింది. నువ్వు అర్హాన్‌ను అదేపనిగా అవమానిస్తున్నావు. ఒక్కటి గుర్తు పెట్టుకో.. నీతోపాటు ఇలా అనవసరంగా దూషిస్తున్న రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లా మృతదేహాలు కూడా దొరక్కుండా చేస్తా. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకోసారి అర్హాన్ గురించి తప్పుగా మాట్లాడితే మీకు అదే ఆఖరి రోజవుతుంది అంటూ ఫోన్‌కు వార్నింగ్ మెసేజ్ పంపింది. దీంతో భయాందోళనకు గురైన దేవలీనా మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ముంబై పోలీసులకు ట్విటర్‌లో పంపి జరిగిన విషయాన్ని వివరించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆమెకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
To @MumbaiPolice @MahaCyber1 please look into this message where i am getting killing threats from this lady.Urge you to take action against it asap. pic.twitter.com/EFYCIks5FJ
— Devoleena Bhattacharjee (@Devoleena_23) April 21, 2020