రిపబ్లిక్ టీవీకి చెందిన రిపబ్లిక్ భారత్ ఛానల్‌కు ఊహించని షాక్ తగిలింది. బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ రూ. 19 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది సెప్టెంబర్ 6న ప్రసారమైన “పూఛ్‌తా హై భారత్” కార్యక్రమంలో అర్ణబ్ గోస్వామి పాకిస్థాన్ ప్రజలను కించపరిచేలా, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆఫ్‌కామ్ ఆరోపణలు చేసింది. “పాకిస్థాన్‌లో పండు ముసలి వ్యక్తి నుంచి చిన్న పిల్లల వరకూ అందరూ ఉగ్రవాదులే అన్నట్లుగా ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్ణబ్‌తో పాటు అందులో పాల్గొన్న సభ్యులు కూడా పాకిస్థానీయులను కించపరిచారు. అప్పటి కార్యక్రమాన్ని మరోసారి ప్రసారం చేయకూడదు” అని ఆఫ్‌కామ్ స్పష్టం చేసింది. కాగా…ఇటీవలే సీఈవో అర్నాబ్ గోస్వామి ఇప్పటికే అరెస్టయ్యారు. 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ కేసులో అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్శ్యామ్ సింగ్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
previous post
నీకు సిగ్గుందా… ? అంటూ హీరోయిన్ పై స్నేహ భర్త కామెంట్స్ వైరల్