telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రియాంకను అరెస్టు చేయడం అక్రమం: రాహుల్ ఫైర్

rahul gandhi to ap on 31st

యూపీలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. ఆదివాసీ రైతులను పరామర్శించడానికి వెళ్లిన ఆమెను అరెస్టు చేయడం అక్రమమని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికార అండతో ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారని ఆరోపించారు.

యూపీలో భద్రతను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. కాగా యూపీలోని సోంభద్ర సమీపంలోని ఓ గ్రామంలో భూ వివాదం విషయమై రెంగు గ్రూపులు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి ఈ ఘటనలో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోంభద్రలో ప్రియాంక గాంధీ పర్యటించారు.

 

Related posts