telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతం!

naksals encounter

చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఇరువర్గాల మధ్య సుమారు 40నిమిషాల పాటు కాల్పులు జరుగాయి. ఈ కాల్పుల్లో ద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది నక్సల్స్ తప్పించుకున్నారు. కాల్పుల అనంతరం భధ్రత బలగాలు సంఘటన స్థలంలో ఒక 303రైఫిల్, ఒక 301 బోర్ తుపాకి మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts