telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

మద్యం తరలిస్తూ పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే కుమారుడు!

liquor shops ap

కర్ణాటక నుంచి ఏపీకీ మద్యం తరలిస్తూ రాయదుర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే గత నెల 30న ‘కేఏ 34 ఏ 5856’ నంబర్ గల టాటా ఏస్ వాహనంలో 624 కర్ణాటక మద్యం బాటిళ్లతో విక్రమ్ వస్తుండగా, రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్‌ చెక్‌పోస్టులో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ పట్టుకున్నారు.

విక్రమ్ తో పాటు వాహన యజమాని మహమ్మద్ అన్సర్, ఆసిఫ్, విశాల్ రాజ్ మహార్ లను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, వీరు తరచూ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని తమ విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేయవద్దని పై స్థాయిలో వత్తిళ్లు వచ్చినట్టు సమాచారం.

Related posts