telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనా వార్డులో ఊడిపడిన ఫ్యాన్!

karona ward in gandhi hospital

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో పలువురు పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు.ఇక్కడ ఉన్న ఓ ఫ్యాన్ అకస్మాత్తుగా హుక్ నుంచి వేరుపడి కిందనే ఉన్న రోగులపై పడింది. ఆ సమయంలో బెడ్ పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.

ఈ ఘటనతో తాము మరింత భయాందోళనలకు గురయ్యామని రోగులు వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.

Related posts