సమాజ గమనాన్ని గుర్తించేది పండితులే కాబట్టి వారికి తెలంగాణా ప్రభుత్వం విశేష గుర్తింపునిచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ వేదపండితుల పురస్కారాల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ వేదపండితులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగు దశాబ్దాలుగా తెలంగాణాలోను అన్ని వృత్తుల మాదిరిగా వేదానికి ప్రాచుర్యం తగ్గిందనితెలిపారు. ఉద్యమ నాయకుడిగా ఉద్యమ కాలంలోనే కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తించి అధికారంలోకి రాగానే గోదావరి నుండి కృష్ణా పుష్కరాల వరకు పెద్ద పీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడైతే చదువు సంస్కారం ఉండదో అక్కడ పండితులు లేరని తెలిపారు.
చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత: నాదెండ్ల భాస్కరరావు