భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో రెండు జట్లు ఒకే దూకుడుగా ఆటను ప్రదర్శిస్తున్నాయి. భారతజట్టు నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. వార్నర్ 40 బంతుల్లో.. ఫించ్ 53 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్ చేరుకున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ జోడీ 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు రాబడుతున్నారు.
ఓపెనింగ్ ద్వయాన్ని విడదీసేందుకు ఆతిథ్య బౌలర్లు శ్రమిస్తున్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 138 రన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఉన్న వార్నర్(54), ఫించ్(52) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు.