telugu navyamedia
తెలంగాణ వార్తలు

అమ్ముడు పోయే సన్నాసులకు మునుగోడు నుంచి తరిమి కొట్టండి…

టీఆర్‌ఎస్‌, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు టీ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు.

శనివారం మునుగోడులో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ అనంతరం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ వైఫల్యాలు, మోసాలపై.. తెలంగాణ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేవలం ఉప ఎన్నికలపైనే టీఆర్ఎస్, బీజేపీలు దృష్టి పెట్టాయని ఆరోపించారు. గొర్ల మందపై తోడేళ్లలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆర్ఎస్, బీజేపీలు వస్తున్నాయన్నారు.

Image

రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో చేసిందని తెలిపారు. మునుగోడు ప్రజలు లక్ష ఓట్లు వేసి గెలిపిస్తే.. మోదీకి రూ.22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు.

మునుగోడు ఉపఎన్నికల వల్ల అమ్ముడు పోయే సన్నాసులకు నిధులు వచ్చాయి తప్ప.. నియోజక వర్గంలో ఏ గ్రామనికైనా నిధులొచ్చాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తున్నానన్నారు.

కాంగ్రెస్ ను విమర్శించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. మీరు ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారు అని ప్రశ్నించారు.సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనందుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నార‌ని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుందన్నారు. కమ్యూనిష్టు పార్టీలను బొందపెట్టిన టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. నాయకులు ఎక్కడికైనా పోనీ మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. విలీన దినోత్సవం పేరుతో మత కల్లోలం సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు.

.

\

Related posts