telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఇక ఉచితంగా భోజనాలు

కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజూ 45 వేల మందికి భోజన సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది.

తాజాగా ఈ కేంద్రాలలో ఉచితంగా భోజనం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఈ రోజు నుంచే ఫ్రీగా మీల్స్ అందించాలని సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇదే విధానం కొనసాగించాలన్నారు.

Related posts