telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హామీలు అమలు చేయడంలో మోదీ విఫలం: ఉత్తమ్‌

T Congress boycott mlc elections

గాంధీభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాలవారీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన డీసీసీ అధ్యక్షులు, మండల, జిల్లా నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రగతి దిగజారిపోయిందన్నారు. మైనార్టీలను అభద్రతాభావంలోకి నెట్టారని ఆయన విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. సమయం తక్కువగా ఉందని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపిచ్చారు. రాహుల్‌, మోదీకి మధ్యే ఈ ఎన్నికలంటాయని ఉత్తమ్‌ అన్నారు. రాహుల్ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తారని ఉత్తమ్ పేర్కొన్నారు.

Related posts