telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఏ దేశం ఆదాయం ఎంత .. భారత్ 7వ స్థానంలో..

wealth of world India in 7th place

ఏ దేశం ఆదాయం ఎంత ఉంది. టాప్ ధనిక దేశాలలో మన దేశానికి జాబితాలో ప్లేస్ దొరకడం పెద్ద విశేషం. న్యూ వెల్త్ వరల్డ్ అందిస్తున్న నివేదిక ప్రకారం దాదాపు 5600 బిలియన్ డాలర్లతో భారత దేశం అత్యధిక ధనిక దేశాల జాబితాలో 7వ స్థానం లో ఉంది. అమెరికా ఎప్పటి నుంచో టాప్ ప్లేస్ లో ఉండగా ధనిక దేశాలుగా ఉన్న కెనడా , ఆస్ట్రేలియా, ఇటలీ లని భారత్ వెనక్కి నెట్టేసింది. ఈ జాబితా లో భారత్ తరవాత ఆస్ట్రేలియా , ఇటలీ , కెనెడా ఎనిమిది – తొమ్మిది – పది స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఎన్నో సంవత్సరాల నుంచీ భారత్ ని బీట్ చేస్తున్న ఈ దేశాలు ఇప్పుడు వెనక్కి నేట్టబడ్డాయి. ఆ దేశాలలో ఆర్ధిక మాంద్యం ఎక్కువగా ఉండడం .. నిరుద్యోగ సమస్య ఇవన్నీ తలెత్తడం వలన ఇలాంటి పరిస్థితి ఎదురు అయ్యింది. భారత్ కంటే ముందర చైనా 2వ స్థానం లో ఉండడం విశేషం.

1. అమెరికా… 48,900 బిలియన్ డాలర్లు
2. చైనా… 17,400 బిలియన్ డాలర్లు
3. జపాన్… 15,100 బిలియన్ డాలర్లు
4. బ్రిటన్… 9,200 బిలియన్ డాలర్లు
5. జర్మనీ… 9,100 బిలియన్ డాలర్లు
6. ఫ్రాన్స్… 6,600 బిలియన్ డాలర్లు
7. భారత్… 5,600 బిలియన్ డాలర్లు
8. కెనడా… 4,700 బిలియన్ డాలర్లు
9. ఆస్ట్రేలియా… 4,500 బిలియన్ డాలర్లు
10. ఇటలీ… 4,400 బిలియన్ డాలర్లు

Related posts