telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

భూ కుంభకోణంలో విచారణను వేగవంతం చేసిన సీఐడీ…

ఏపీలో ఇప్పుడు ఎన్నికల కంటే అమరావతి భూ కుంభకోణం ఎకుక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన సీఐడీ… ఇప్పటికే విచారణకు హాజరుకవాల్సిందిగా నేతలకు నోటీసులు కూడా జారీ చేసింది.. మరోవైపు.. అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటుందా? అనే చర్చ సాగుతోంది.. కేబినెట్ ఆమోదం లేకుండా అసైన్డ్ భూముల విషయంలో జీవోలు జారీ చేయడంలో అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీస్తోంది. పాత విషయాలను అన్నింటిని బయటకు లాగుతుంది. అప్పట్లో గుంటూరు జిల్లా జేసీగా, తర్వాత సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ పాత్రపై సమాచారం సేకరించే పనిలో పడిపోయింది సీఐడీ అధికారులు టీమ్. మరోవైపు.. వివాదస్పద జీవో 41ను జారీ చేశారు అజైన్ జైన్. దీంతో.. అధికారులపై నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి చేశారన్న కోణంలో విచారణ చేపట్టింది సీఐడీ.. గతంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన నాగులాపల్లి శ్రీకాంత్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు సీఐడీ అధికారులు. అయితే చూడాలి మరి ఈ కేసులో ఇంకా ముంహు ముందు ఏం జరగనుంది అనేది.

Related posts