telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై పరశురామ్ దర్శకత్వంలో నవీన్, వై రవి శంకర్, సీవీ మోహన్, మహేష్ బాబు, రాము అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని పక్కా మాస్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ బ్యూటీ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మల్లో మోనాల్ గజ్జర్ కూడా ఒకరు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ మోనాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ సినిమా సర్కారు వారి పాటలో కూడా స్పెషల్ సాంగ్‌ కోసం మోనాల్‌తో చర్చలు జరిపారట. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts