telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. ఆర్థిక రాజధానిగా .. విశాఖ.. ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న సీఎం ..

visakha will be 2nd capital to AP

రాష్ట్ర రాజధానిపై రగడ జరుగుతున్నప్పటికీ సీఎం జగన్ అభివృద్ధి అంతా ఒకేచోట కాకుండా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో ముందుకుపోతున్నారు. ఆ దిశగానే కార్యాచణలో ఒక్కోఅడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజధానిగా విశాఖ ఉండటం అవసరమని జగన్ భావిస్తున్నారని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను గాడిలో పెడుతూనే, మరోపక్క అభివృద్ధిపై తక్షణ నిర్ణయాలు అమలుచేస్తూపోతున్నారు. అందులో భాగంగానే సీఎం జగన్ తనదైన శైలీలో రాజకీయ నిర్ణయం తీసుకుని, తాను విదేశాలకు వెళుతూనే ఇక్కడ తన మంత్రి బొత్స చేత రాజదానిపై సంచలన ప్రకటన చేయించారు. బొత్స రాజేసిన రాజదాని మంటలు కార్చిచ్చులా అంటుకుని మండుతూనే ఉండగా సీఎం జగన్ మాత్రం రాజదానిపై ఎలాంటి క్లారిటి ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాడు.

అమరావతికి ప్రత్యామ్నయంగా మరో రాజధానిని ఏర్పాటు చేస్తే అది ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా ఉండేలా వ్యూహత్మకంగా పావులు కదుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం ఐటి ఎగుమతులతోనే అధిక ఆధాయం పొందడంతో పాటు, ఉద్యోగ అవకాశాల కల్పన కూడా పెరుగుతుంది. తద్వారా ఆ రాష్ట్రం అభివృద్ది పథంలో సాగుతుందని గ్రహించిన సీఎం జగన్, చంద్రబాబు చేయని ఈ పనిని చేస్తే ఏపీకి తిరుగుండదని తాను ఈ పని చేసి చూపాలనే పట్టుదలతో ఉన్నారట. ఏపీకి రాజదానిగా అమరావతిని కొనసాగిస్తూనే అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏపీలో రెండో రాజదానిగా విశాఖపట్నంను ఎంపిక చేయాలని ఆలోచన చేస్తున్నాడట. అక్కడైతే ఐటీకి అన్ని అనుకూలమైన వనరులు ఉన్నాయట. విశాఖ అయితే అక్కడ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.. దీనికి తోడు సిని పరిశ్రమను కూడా అక్కడికే తరలించే ఆలోచన చేస్తున్నాడట. ఐటీ హబ్‌గా మార్చితే మరో బెంగుళూరు, హైదరాబాద్‌, పుణే లాగా తయారు చేయవచ్చని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారట.. విశాఖలో ఇప్పటికే ఐటీకి సంబంధించిన పలు కంపెనీలు ఉన్నాయి. వీటికి తోడు మైక్రోసాప్ట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఒరాకిల్ వంటి కంపేనీలు రప్పించగలిగేలా అక్కడ రాజదానిని చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడట. అంటే ఏపీకి రెండో రాజదానిపై జగన్ ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదే జరిగితే విశాఖ ఐటీ హబ్‌గా మారనుందన్నమాట.

Related posts