telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ చేసిన ఆందోళనల కారణంగానే పీఆర్సీ వచ్చింది : బండి

పీఆర్సీ కోసం బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు, రక్తం చిందించారు, జైలు పాలు కూడా అయ్యారు. బీజేపీ చేసిన ఈ ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు బండి సంజయ్. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆందోళన చెందిన కేసీఆర్.. రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని పీఆర్సీ ఇస్తున్నట్లు చెప్పి వాళ్ల ద్వారా ప్రకటనలు చేయించుకున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా బీజేపీ ఒత్తిడి వల్లనే సీఎం కేసీఆర్ అనివార్యంగా పీఆర్సీ ప్రకటించారనడం వాస్తవం అన్నారు బండి. గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులందరిని ఈ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు బండి సంజయ్.. కనీసం, 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసిందన్న ఆయన.. పీఆర్సీ కమిటీ వేసిన నాటినుంచి పూర్తిగా  మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినప్పుడే ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేసినట్లే అవుతుందన్నారు.

Related posts