telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సింపతీ పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టిన మమత…

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బీజేపీ, టీఎమ్‌సీ ఢీ కొడుతున్నాయి. అయితే బీజేపీ.. ప్రత్యర్థిగా మారిన తర్వాత మమత రూట్‌ మార్చుకున్నారు. నందిగ్రామ్‌లో సవాల్‌ విసురుతున్న సవేందును ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయం మొదలుపెట్టారన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకే ఇక్కడ విక్టీమ్‌ కార్డు వాడుతున్నారన్న మాట ప్రచారంలోకి వచ్చింది. సానుభూతి తెరమీదికి తీసుకొచ్చారు. బెంగాల్‌ ఆడబిడ్డగా చెప్పుకుంటున్న మమత బెనర్జీ.. ఇప్పుడు సింపతీ పాలిటిక్స్‌పై ఫోకస్‌ చేసినట్లు కనిపిస్తోంది. సీఎంపై దాడి జరిగిందన్న మాట వినగానే అయ్యో.. అనే సానుభూతి కనిపిస్తుంది. అందుకే దీదీ కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు. సరిగ్గా మమతపై దాడికి ముందు రోజు ఎన్నికల సంఘం బెంగాల్‌ డీజీపీని మార్చింది. ఆ మర్నాడే ఈ ఘటన జరగడంతో..  డీజీపీని మార్చడం వల్లే ఈ దాడి జరిగిందనే మాటను జనాల్లోకి తీసుకెళ్తోంది టీఎమ్‌సీ. చూడాలి మరి ఈ సింపతీ దీదీ కి అక్కడ ఎంత వరకు పని చేస్తుంది అనేది.

Related posts