ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 22 వేల మార్కును దాటేసింది. నిన్న ఒక్క రోజే 1,062 మంది వైరస్ బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 264కు చేరుకుంది.
ఈ వైరస్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది.టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా బారిన పడిన సిబ్బందికి భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.
టీం ఇండియా గెలుపు కోసమే సానియా అక్కడికి వెల్లిందట!