telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ కు తప్పని లీకుల బెడద…

మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్‌ కున్న అభిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనికూడా లేదు. అతడికి అభామానులు ఉండరని కేవలం భక్తులు మాత్రమే ఉంటారని టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల పవన్ రాజకీయాల్లోకి వేళ్లిన సంగతి తెలిసిందే. దాంతో తన సినీ జీవితానికి ఎంతగానో దూరమయ్యాడు. తరువాత కొన్నాళ్లకు పవన్ తన సినీ జీవితానికి తిరిగి వచ్చాడు. తన రీఎంట్రీలో తాను చేస్తున్న మొట్టమొదటి సినిమా బాలీవుడ్ సినిమా పింక్ రీమెక్. ఈ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు ఓ పెద్ద సమస్య ఎదురైంది. అదే లీకుల సమస్య. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీకులవుతూనే ఉన్నాయి. పవన్ లొకేషన్‌లో ఉన్న పోటోలు బయటకు రావడం, అది తెలుకునే లోపలే వైరల్ అవ్వడం అంతా శరవేగంతో గడిచిపోతోంది. ఇటీవల మొదలైన షూట్‌కు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ లీకులు భారీగా వైరల్ అవ్వడంలో పవన్ అభిమానులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫోటో వచ్చిన అనంతరం ఆ ఫోటోను తెగ షేర్లు చేసి వైరల్ చేస్తున్నారు. అయితే ఈ లీకులను ఎలా కట్టడిచేయాలో సినిమా మేకర్స్‌కే తెలియాలని అంటున్నారు.

Related posts