తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించి ఫలితం సాధించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.
ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని ఏపీ అధికారులకు కేసీఆర్ సూచించారు. సలహాదారులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శుల ఆధ్వర్యంలో శనివారం చర్చలు జరుపుతారు. ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన అంశాలపై చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణాకు జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జూలై 15లోగా ముఖ్యమంత్రులకు అధికారుల నివేదిక సమర్పిస్తారు.
మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి