telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చైనా-అమెరికా వాణిజ్య ఒప్పందం.. 15న సంతకం..

Why China's strategy for terrorism changes

ఈ నెల15న చైనాతో కుదుర్చుకున్న మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ సంతకం చేయనున్నారు. వైట్‌ హౌస్‌లో జరిగే ఓ కార్యక్రమంలో అతి పెద్ద, సమగ్ర ఒప్పందంపై సంతకాలు చేస్తామని, ఈ కార్యక్రమానికి చైనా ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రెండో దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆ తరువాత చేపడతామన్నారు. ఇంతకుముందు వచ్చిన వార్తలను బట్టి చైనా ఉప ప్రధాని లియూ హీ, చైనా ఉన్నత వాణిజ్య ప్రతినిధి ఈ సంతకాల కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిసింది.

మొదటి దశ ఒప్పందం ప్రకారం 2019 డిసెంబరు15 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త వాణిజ్య సుంకాలను నిలుపుచేసేందుకు, ఇతర సుంకాలను తగ్గించుకునేందుకు అమెరికా అంగీకరించింది. దీనికి ప్రతిగా అమెరికా నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు చైనా ఒప్పుకుంది. ఆ తరువాత తదుపరి విడత చర్చలు మొదలెట్టేందుకు ట్రంప్‌ చైనా వెళ్లాలని యోచిస్తున్నారు.

Related posts