మేషరాశి..
నిరోద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి. అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. విందువినోదాలు పాల్గొంటారు. భూ, వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి ఏర్పడుతుంది.. ఉద్యోగస్తులకు పై అధికారులునుంచి వచ్చే ఒత్తిడులనుంచి అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించడం మంచిది.
వృషభరాశి..
కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. స్త్రీలకు బంధువుల ఇంటికి రావడం వల్ల ఒత్తిడి, పనిభారం ఎక్కువవుతుంది. రుణాలు చేస్తారు. అనుకని ప్రయాణాలు చేస్తారు. సహనాన్ని కోల్పోకండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువవుతుంది.
మిథునరాశి..
కుటుంబ శుభకార్యాలకు హాజరవుతారు. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకరాశి…
కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవదర్శనాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
సింహరాశి..
ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో అవంతారాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్యం సూచన . వ్యాపారాలు అంతగా కలిసిరావు.
కన్యరాశి..
ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా చికాకులు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం బారిన పడతారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి సమయం ఆసన్నమైంది.
తులరాశి..
చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం ఏర్పడుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తులాభాలు లభిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
వృశ్చికరాశి..
బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనుస్సురాశి..
కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. గిట్టనివారి మాటలను పట్టించుకోకండి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా పడతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటుంది.స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయడం మంచిది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
మకరరాశి..
స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయి.
కుంభరాశి..
సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఒత్తిడులు తొలగుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం మంచిది.
మీనరాశి..
కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడతాయి. దైవదర్శనాలు చేస్తారు. మిత్రులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి.