telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్‌ 02, మంగళవారం రాశిఫలాలు

మేషరాశి..
ఆకస్మిక ఇబ్బందులు. ఆనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు ఓపికతో ఉండండి. ఉద్యోగస్తులు శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆఫీస్‌లో శ్రమ తప్పదు.

వృషభ రాశి..
బంధువుల లేదా స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ధనలాభం. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.

మిధునరాశి..
వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆస్పత్రి, బిల్లులు, పెన్షన్, గ్రాట్యుటీ, వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. స‌మాజంలో ప‌లుకుబడి పెరుగుతుంది.

కర్కాటక రాశి..
అనారోగ్యం బారిన ప‌డ‌తారు. బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు.

సింహరాశి..
వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆ దైవ సేవా కార్యక్రమాలల పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెళకువ అవసరం.

కన్య రాశి..
అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆఫీస్‌లో శ్రద్దతో పనిచేయాలి. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు అలసట, అధికశ్రమ తప్పదు. అధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల రాశి..
ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేరు. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రావచ్చు.

వృశ్చిక రాశి..
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. స్త్రీల అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. కొన్ని సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుంటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి.

ధనస్సు రాశి..
ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు చేప‌డ‌తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ఆఫీస్‌లో బాగా శ్రమ పడాల్సిన రోజు.

మకర రాశి..
వ్యాపారులకు నష్టాలు రావచ్చు. పనులు ముందుకు సాగవు. ఆఫీస్‌లో ఆశించిన ఫలితం ఉండదు. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. బంధు మిత్రుల రాకపోకల వల్ల ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

కుంభ రాశి..
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. జీవితం ఆనందంగా గడచిపోతున్నప్పటికీ, మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. అనవసర విషయాలతో సమయం వృథా చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీన రాశి..
ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది. కొన్ని పనులు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకుంటారు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి మీ అభిమానం చాటుకుంటారు. లాభాలు రావచ్చు. ప్రయాణాలు కలసి వస్తాయి.

Related posts